యువనాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షాలు

606
Ktr Birthday
- Advertisement -

డైనమిక్ లీడర్, జన నేత, ఆపద్భాందవుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు. నేటితో ఆయన 42ఏండ్లు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈసందర్భంగా ఆయనకు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మరికొందరు అయితే కేటీఆర్ పేరుతో పలు స్వచ్చంద సంస్ధలకు డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. అలాగే కొంతమంది రక్తదానం కూడా చేస్తున్నారు. కేటీఆర్ బర్త్ డే విషెస్‌తో ట్విట్టర్‌ మార్మోగిపోయింది. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేస్తూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐటీ శాఖ మంత్రి పనిచేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ కు తీసుకురావడంతో కీలక పాత్ర పోషించారు మన కేటీఆర్. ఉద్యమసమయం నుంచి తండ్రికి తోడుగా ఉంటు ఆయన బాటలోనే నడుస్తున్నాడు. తాను చేసే మంచి పనులతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కేటీఆర్. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కేటీఆర్. యువ నాయకుడు మన రామన్న సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలిని కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ టీవీ తరపున వ్యాపి బర్త్ డే సర్.

- Advertisement -