తృణమూల్‌లో చేరిన క్రికెటర్‌ మనోత్ తివారి..

64
tiwari

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఒక్కొక్కరుగా తృణమూల్‌ని వీడి బీజేపీలో చేరుతుండగా తాజాగా భారత క్రికెటర్‌ మనోత్ తివారీ…సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలో చేరారు. హుగ్లీలోని చిన్సురాలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తివారీ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.

బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న తివారీని ఛోటా దాదాగా పిలుచుకుంటారు బెంగాల్ ప్రజలు. ఈ నేపథ్యంలో తివారీ టీఎంసీలో జాయిన్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌ తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.