నిషా ఎక్కిస్తున్న మనీషా..

477
Bollywood Actress Manisha Koirala Enoying Beach Yoga In Thailand
Bollywood Actress Manisha Koirala Enoying Beach Yoga In Thailand
- Advertisement -

‘క్రిమినల్’, ‘బొంబాయి’, ‘బాబా’ ,ఒకే ఒక్కడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మనీషా కొయిరాల. ఇటీవలే తను కాన్సర్ కి గురైంది, దాని కోసం చాలా రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకున్నాక మనీషా కొయిరాల మళ్ళీ పబ్లిక్ లోకి వస్తోంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, భర్తతో విభేదాల కారణంగా పెళ్ళిని పెటాకులు చేసుకుందామె. ప్రస్తుతం ఒంటరిగానే జీవితం గడుపుతోంది మనీషా. మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉంది. గత రెండేళ్లుగా హిందీతో పాటు తమిళ్.. కన్నడ.. మలయాళ సినిమాల్లో కూడా నటించేస్తోంది.

Manisha-Koirala-thailand-1478673013-1913

ఇటీవల నెపాలీ బ్యూటీ థాయ్ ల్యాండ్ కు షూటింగ్‌కి వెళ్లినట్టుంది. థాయ్‌ ల్యాండ్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ఎంజాయ్ చేయ్యాల్సిందేనన్నట్టుగా డ్రింక్ గ్లాస్ లతో సెల్ఫీలు తీసుకుంది మనీషా. టూపీస్ బికినీ వేసుకుని.. పూర్తిగా వెనక్కి వాలిపోతూ బీచ్ లో ఈ 46 ఏళ్ల మనీషా వేసిన ఓ ఆసనం చూసిన అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోవడమే కాదు.. నిషా తలకెక్కేసింది. ఈ ఆసనం పేరు ‘సేతు బంధ శిరాసనం’. ఇది చాలా క్లిష్టమైన ఆసనాల్లో ఒకటి. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉందంటే.. మనీషా ఫిట్నెస్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

manisha-koirala_1478596403

ప్రస్తుతం హిందీలో ‘డియర్ మాయ’, ‘మౌలాలి’ సినిమాలు నటిస్తోంది మనీషా. వచ్చే ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంది. మనీషా కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉంటారు. ముంబయ్‌లో సెటిలయ్యాక ఒంటరిగా ఫీలవుతున్నా. ఓ మనిషి తోడు అవసరం ఉండడంతో పెళ్లి కంటే ముందు దత్తత తీసుకోవాలనుకుందట మనీషా…

- Advertisement -