పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముసలం!

1
- Advertisement -

త్వరలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా హస్తం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, చండీగఢ్ ఎంపీ అయిన మనీష్ తివారీకి పంజాబ్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణలో ఎలాంటి కీలక బాధ్యతలు దక్కలేదు.

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ప్రతాప్ సింగ్ బాజ్వాను నియమించింది. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించడంతో పాటు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను మరియు పలు ఎన్నికల కమిటీలను పార్టీ పునర్వ్యవస్థీకరించింది.

అయితే పంజాబ్ నుండి కాంగ్రెస్‌కు ఉన్న అత్యంత ప్రముఖ జాతీయ ముఖాలలో ఒకరైన,..మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన మనీష్ తివారీ పేరు ఈ జాబితాలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే తివారీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది….వ్యక్తులు మరియు వ్యవస్థలలో ఉండే అభద్రతాభావాలకు ఒక విరుగుడు ఉంటే బాగుండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 ఏళ్లుగా @INCIndia కాంగ్రెస్ పార్టీకి నా జీవితం మొత్తాన్ని దారపోశాను అని తెలిపారు. మనీష్ తివారీ కాంగ్రెస్ నాయకత్వాన్ని నేరుగా ప్రశ్నించనప్పటికి తన అసంతృప్తిని మాత్రం వెళ్లగక్కారనే టాక్ నడుస్తోంది.

 

Also Read:నాగబంధం..చాలా కాస్ట్లీ సినిమా!

- Advertisement -