SIR:చట్టపరమైన హక్కు ఈసీకి లేదు

4
- Advertisement -

లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏడోరోజు SIRపై చర్చ జరిగింది. ఎన్నికల సంస్కరణలు, ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత పునఃసమీక్ష (Special Intensive Revision — SIR)పై చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి.

‘ఉచిత పథకాల’ పేరిట ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.ఎన్నికలకు 15 నెలల ముందే ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ద్వారా ప్రభుత్వ నిధులను తప్పుగా వినియోగించారు అని ఆయన అన్నారు. ఇలాంటి ముందస్తు నగదు బదిలీలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసి, రాబోయే ఎన్నికల సమగ్రతపై తీవ్రమైన సందేహాలు కలిగించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

SIR చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs) పారదర్శకత, పనితీరుపై ఆందోళనలు వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యం విశ్వాసంపై నడుస్తుంది అని చెప్పిన ఆయన, “ఈ EVM కి సోర్స్ కోడ్ ఎవరి వద్ద ఉంది? నాకు ఇప్పటివరకు సమాధానం రాలేదు అని ప్రశ్నించారు.

యంత్రాలను మానిప్యులేట్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, 100% VVPAT లెక్కింపు లేదా పేపర్ బ్యాలెట్ విధానానికి పూర్తిగా మారాలని కోరారు. ఆరు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, “సత్యం స్పష్టంగా బయట పడేందుకు” పేపర్ బ్యాలెట్లు ఉపయోగించాలని సూచించారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న SIR ప్రక్రియను ఎన్నికల కమిషన్‌కు చట్టపరమైన అధికారం లేదని తివారి విమర్శించారు. SIR ని పూర్తిగా బీహార్, కేరళ వంటి మొత్తం రాష్ట్రాలకు వర్తింపజేయకూడదని, “నిజమైన లోపాలు ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తించాలి” అని ఆయన పేర్కొన్నారు.

Also Read:జపాన్‌లో భూకంపం..ప్రభాస్ సేఫ్

- Advertisement -