మణిరత్నం – సూపర్ స్టార్ రజనీకాంత్ కలయిక గుర్తు వచ్చినా, లేక, వీరి సినిమాల ప్రస్తావన వచ్చినా ‘దళపతి’ సినిమా గుర్తుకు రాకుండా వుండదు. రజినీ కెరీర్ కి ఆ సినిమా ఊపిరి పోసింది. గొప్ప సినిమా అంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే, రజినీ – మణిరత్నం మళ్లీ దశాబ్దాల కాలం తరువాత కలిసి మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాల తెరవెనుక కింగ్ పర్సన్ గా వున్న ఉదయానిధి స్టాలిన్ ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అనురుధ్ అందిస్తారు. రజినీకాంత్, మణిరత్నంల కలయికలో వచ్చిన దళపతి దేశ సినిమా లైబ్రరీలో ఓ రిఫరెన్స్ ఫిల్మ్ గా నిలిచింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. అయితే, ఈ సినిమా గురించి రజినీకాంత్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు.
కాకపోతే, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి మణిరత్నంతో సినిమా చేయడానకి ఉత్సాహంగా వున్నాను. ఒకేరకమైన మనస్తత్వంతో వున్న వారితో కలసి పని చేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది’ అంటూ రజినీకాంత్ ఆ మధ్య చెప్పుకొచ్చాడు. కానీ రజినీకాంత్ తో తన సినిమాని మాత్రం మణిరత్నం సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇన్నాళ్లకు ఈ కాంబో లో మూవీ రాబోతుంది అని టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి..