మరో వివాదంలో మ‌ణిక‌ర్ణిక..!

219
- Advertisement -

బాలీవుడ్‌ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్‌.. ఈ అమ్మ‌డు శుక్ర‌వారం మ‌ణిక‌ర్ణిక చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్‌ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా తెర‌కెక్కించారు. చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ చిత్రంలో వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయిని త‌ప్పుగా చూపించారంటూ హిందూ క‌ర్ణిసేన ఆందోళ‌న‌కి దిగారు. సినిమా విడుద‌ల‌ని ఆపాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ల‌క్ష్మీ భాయ్‌ని అగౌర‌వ‌ప‌రిచేలా ఏ ఒక్క సీన్ ఉన్నా కూడా కంగ‌నా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని క‌ర్ణిసేన హెచ్చ‌రిస్తుంది.

Manikarnika

ఈ వివాదంపై గతంలో కంగన స్పందిస్తూ..‘నేను ఎవ్వరికీ భయపడను. నేనూ రాజ్‌పుత్‌నే. సెన్సార్‌ బోర్డు క్లీన్‌ యూ/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చినప్పటికీ బెదిరింపులకు పాల్పడితే కర్ణిసేన కార్యకర్తలను నాశనం చేస్తాను’ అని హెచ్చరించారు. కంగన వ్యాఖ్యలు కాస్తా దుమారం రేపాయి. కర్ణిసేన సంఘాలను అవమానించిన కంగన వెంటనే క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు.

దీనిపై కంగన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పను. జీవితంలో ఇప్పటివరకు నా తప్పులేకుండా మరొకరికి క్షమాపణలు చెప్పింది లేదు. సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం. అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడంలేదు. అలాంటప్పుడు కర్ణిసేన మాకు మద్దతుగా నిలవాలి. లక్ష్మీబాయి నా బంధువు కాదు. ఆమె భారతదేశ ముద్దుబిడ్డ.’ అని చెప్పారు. శుక్రవారం ‘మణికర్ణిక’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదల కాబోతోంది.

- Advertisement -