రవితేజ పుట్టినరోజున కొత్త మూవీ టైటిల్‌..

387
Ravi Teja
- Advertisement -

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ఈ మధ్య వ‌రుస‌ సినిమాలతో దూసుకెళ్లుతున్నాడు. రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్ చిత్రాలు తరువాత రీసెంట్‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల వచ్చాడు. అయితే రాజా ది గ్రేట్ మూవీ తర్వాత ఈ మస్‌మహారాజాకు సరైన హిట్ పడలేదు. దీంతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు రవితేజ.

Ravi Teja

ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. క్రితం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కానీ కథా కథనాలు మరింత పట్టుగా వచ్చేలా రవితేజ జాగ్రత్తలు తీసుకోవడంతో ఆలస్యమైంది. ఈ నెల 26వ తేదీన రవితేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ రోజున టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్‌ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడనుందని సమాచారం.

- Advertisement -