“మణికర్ణిక” డైరెక్టర్ క్రిష్ కాదా.. కంగనానా..?

288
- Advertisement -

“మణికర్ణిక : ది క్వీన్ అఫ్ ఘాన్సీ ” చిత్రం విషయం లో రోజుకో కొత్త కథ పుట్టుకొస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకు కారణం ఎన్టీఆర్ బయోపిక్ తీసేందుకు క్రిష్ ఒప్పుకోవడమే. క్రిష్ ఈ సినిమాను మధ్యలో ఆపి ఎన్టీఆర్ సినిమా ముందు పూర్తి చేసేందుకు సిద్ధమవ్వడంతో ఈ చిత్రం వాయిదా పడింది. ఆ తరవాత క్రిష్ కి , కంగనా కి విభేదాలు వచ్చాయని, దాంతో ఈ సినిమా ఆగిపోయిందని ఎన్నో పుకార్లు వెల్లువెత్తాయి.

Manikarnika clapboard shows Kangana Ranaut as 'director', actor's ...

అయితే తన సినిమా ఆగిపోలేదని, క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ఒప్పుకోవడం తో అది ముందు పూర్తి చేయాలి కాబట్టి కొంత వాయిదాపడిందని, తనకి, క్రిష్ కి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని తెలిపి పుకార్లకు అడ్డుకట్టవేసింది కంగనా. అయితే తాజాగా మణికర్ణిక సెట్ లోని క్లాప్ బోర్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Manikarnika clapboard shows Kangana Ranaut as 'director', actor's ...

మణికర్ణిక సెట్ లోనిదని స్పష్టంగా తెలుస్తున్న ఆ క్లాప్ బోర్డ్ పై డైరెక్టర్ పేరు దగ్గర కంగనా పేరు ఉండటం చర్చలకు దారి తీస్తుంది. అది చూసిన నెటిజన్లంతా మణికర్ణిక సినిమా క్రిష్ చేయట్లేదా..? కంగనానే డైరెక్ట్ చేస్తుందా..? అంటూ పలు పలు సందేహాలతో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం పై మణికర్ణిక చిత్ర బృందం మాట్లాడుతూ..క్రిష్ వేరే సినిమా లో బిజీ గా వున్న కారణం గా షూట్ లో కొన్ని ప్యాచ్ వర్క్ లు మిగిలిపోయాయని, వాటిని కంగనా చూసుకుంటుందని, సెట్స్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ రాకూడదని ఆమె పేరు పెట్టినట్టు చెప్పి ఓ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -