కాంగ్రెస్‌ ద్రోహంపై 4న దీక్ష:మందకృష్ణ

14
- Advertisement -

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహంపై మే 4న దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.తెలంగాణ‌లో ఉండే మాదిగ‌లు పార్టీల‌కతీతంగా కాంగ్రెస్ పార్టీపై నిర‌స‌న తెల‌పాలని… రేవంత్ మాదిగ‌ల‌కు చేసిన ద్రోహంపై మే 4న దీక్ష‌కు పిలుపునిస్తున్నాం అన్నారు. రేవంత్ రెడ్డి రాజ‌కీయ మూల్యం చెల్లించుకొక త‌ప్ప‌దు అని హెచ్చ‌రించారు.

రేవంత్ రెడ్డి రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు మాదిగ‌లు ప్ర‌ధాన పాత్ర పోషించారన్నారు. త‌న గెలుపున‌కు మాదిగ‌లు స‌హ‌కారం అందించార‌ని స్వ‌యంగా రేవంత్ చెప్పారు. రేవంత్ రెడ్డి వ‌ల్ల మోత్కుప‌ల్లి న‌ర్సింహుల‌కు తీవ్ర అవ‌మానం జ‌రిగిందన్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ నుంచి మాదిగ‌ల‌కు ప్రాధాన్యం లేకుండా పోతుంది. మాల‌ల‌తో కుమ్మ‌క్కై మాదిగ‌ల‌కు రేవంత్ అన్యాయం చేస్తుండు. క‌డియం కులం గురించి విచార‌ణ జ‌ర‌పాల‌ని గ‌తంలో రేవంత్ అన్నాడు. వ‌రంగ‌ల్‌లో ఎంతో మంది మాదిగ జాతి నాయ‌కులు ఉండ‌గా, క‌డియం కావ్య‌కు టికెట్ ఎందుకు ఇచ్చారు..? అని ప్రశ్నించారు.

Also Read:KTR:ప్రజ్వల్‌ని ఎందుకు దేశం విడిచేలా చేశారు?

- Advertisement -