టాలీవుడ్‌లో అక్టోబర్ 10న జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు ప్రెసిడెంట్‌గా గెలుపోందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.
విష్ణు ప్యానెల్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..
– మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం!
– తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం.
– ‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు.
– ‘జాబ్ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం!
– అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం.
– ‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్ కమిటీ
– గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం.
– అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం.
– కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం
– ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు
– ‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ.
– అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్ గణనీయంగా పెంచే ఏర్పాటు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి.
– తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం!