మా ఎన్నికలు…విష్ణు ప్యానల్ ఇదే

50
vishnu

మా ఎన్నికల్లో పోటీ చేసే ప్యానల్‌ని ప్రకటించారు మంచు విష్ణు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించగా తాజాగా మంచు విష్ణు కూడా తన ప్యానల్‌ని ప్రకటించారు.

మంచు విష్ణు అధ్య‌క్షుడిగా పోటీ చేయ‌నుండ‌గా, ర‌ఘు బాబు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, బాబు మోహ‌న్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌, మాదాల రవి – వైస్‌ ప్రెసిడెంట్‌, పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి – వైస్‌ ప్రెసిడెంట్‌, శివబాలాజీ – కోశాధికారి, కరాటే కల్యాణి -జాయింట్‌ సెక్రటరీ, గౌతమ్‌ రాజు-జాయింట్‌ సెక్రటరీ ప‌ద‌వుల కోసం పోటీ చేయ‌నున్నారు.

మా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా అర్చన,అశోక్‌కుమార్‌,గీతాసింగ్‌,హరినాథ్‌బాబు,జయవాణి,మలక్‌పేట్‌ శైలజ, మాణిక్‌, పూజిత, రాజేశ్వరీ రెడ్డి,సంపూర్ణేశ్‌ బాబు,శశాంక్‌,శివన్నారాయణ,శ్రీలక్ష్మి,శ్రీనివాసులు,స్వప్న మాధురి,విష్ణు బొప్పన,వడ్లపట్ల,రేఖ ఉన్నారు.

అక్టోబ‌ర్ 10 ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.