తారక్…కారు నెంబర్ ధరెంతో తెలుసా..?

53
ntr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవలె కొత్త లగ్జరీ కారును కొన్న సంగతి తెలిసిందే. లంబోర్ఘి ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకోగా ఈ కారు ఖరీదు అక్షరాల దాదాపు నాలుగు కోట్ల రూపాయ‌లు. ఇక తారక్‌కు 9999 కారు నెంబర్ సెంటిమెంట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన కొత్తకారు ఫ్యాన్సీ నెంబర్ కోసం భారీ మొత్తంలో చెల్లించారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేయ‌గా, జూనియ‌ర్ ఎన్టీఆర్ TS 09 FS 9999 నంబర్ కోసం దాదాపు రూ. 17 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్‌ బిడ్‌ అని అధికారులు వెల్లడించారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాల‌తో పాటు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమా చేయ‌నున్నాడు.