ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: మంచు మనోజ్

4
- Advertisement -

మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన F5 రెస్టారెంట్‌ను పరిశీలించారు నటుడు మంచు మనోజ్. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుతున్నారు అన్నారు. మోహన్ బాబు సిబ్బంది హేమాద్రి నాయుడు, ఫోటోగ్రాఫర్ మౌళి వారిని కొట్టి బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు అని ఆరోపించారు.

ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు.. ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టికి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారు అన్నారు.

మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారు.. ఇది ఆస్తి గొడవలు కాదు.. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటం అన్నారు. తెలంగాణలో మీడియా, పోలీసుల సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగాం అని తెలిపారు.

Also Read:చెమట పొక్కులకు చెక్ పెట్టండిలా..!

- Advertisement -