- Advertisement -
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారీన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే డాక్టర్లను సంప్రదించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ.. అభిమానులను ఆందోళన చెందవద్దని కోరాడు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. గత వారం నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరు చేయించుకోవాలని సూచించారు. కరోనా ఒమిక్రన్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు.
- Advertisement -