రంగనాయకస్వామి టెంపుల్‌ని అభివృద్ధి చేస్తా: మల్లారెడ్డి

19
mallareddy

మేడ్చల్ జిల్లా…ఘట్కేసర్ మండలం ఔషపూర్,మదారం,మర్పల్లిగుడా,ఘనపూర్,వెంకటాపురం,చౌదరిగుడా,కొర్రెముల,కాచవని సింగారం గ్రామాల్లో దాదాపు 80 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఔషపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం మరియు పల్లె దవాఖాన ప్రారంభించడం జరిగింది.

అలాగే యంనంపేట లోని రంగనాయక స్వామి ఆలయ ఛైర్మెన్ పొలగొని రాజేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయక స్వామి దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎండౌమెంట్ అధికారులు,జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి,ఎంపీపీ సుదర్శన్ రెడ్డి,ఎంపీటీసీలు,సర్పంచులు, కౌన్సిలర్లు,కో ఆప్షన్ మెంబర్ లు,తెరాస పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.