ప్చ్..మంచు లక్ష్మి బెడ్ సీన్స్ లోనూ!

61
- Advertisement -

మంచు లక్ష్మి అస్సలు తగ్గట్లేదుగా.. అవును మొన్న బికినీలో హీట్ పుట్టించింది. ఇప్పుడు ఓ హిందీ వెబ్ సిరీస్ కోసం కొన్ని బోల్డ్ సీన్స్ కూడా చేసిందని తాజాగా హిందీ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ టాక్ విన్న వారు నిజమే అయ్యి ఉంటుంది అంటూ పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్ లో క్రేజ్ కోసం మంచు లక్ష్మి ఎంతకైనా తెగిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ క్రేజ్ కోసమే ఈ మధ్యన సోషల్ మీడియాలో మంచు లక్ష్మి విపరీతంగా యాక్టీవ్ అయ్యింది. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది.

నిజంగా మంచు లక్ష్మి ఈ రేంజ్ యాక్టీవ్ గా ఉండడం ఇదే మొదటిసారి. పైగా ప్రస్తుతం వెండితెర మీద పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడమే కాదు.. షాప్ ఓపెనింగ్స్ లో రిబ్బన్ కటింగ్స్ అంటూ మంచు లక్ష్మి హడావిడి కూడా చేస్తుంది. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం వరకూ మంచు లక్ష్మి గ్లామర్ షో కన్నా ఎక్కువగా పట్టు చీరల ఫోటో షూట్స్ తో అందంగా తయారయ్యేది. కాంజీవరం పట్టు చీరలని ప్రమోట్ చేస్తుందా అనేలా మంచు లక్ష్మి షూట్స్ ఉండేవి. ముఖ్యంగా రోజుకో పట్టు చీరలో మంచు లక్ష్మి మెరిసిపోయేది. మంచి మంచి కలర్స్ ఉన్న పట్టు చీరల్లో మంచు లక్ష్మి చాలా స్టయిల్ గా హొయలు పోతూ ఉండేది.

కానీ, ఈ మధ్యన మంచు లక్ష్మి బికినీ వేసుకుని మరీ, చేయించుకుంటున్న ఫోటో షూట్స్ ను చూస్తుంటే.. మంచు లక్ష్మి అస్సలు తగ్గడం లేదుగా అనిపిస్తోంది. తన భర్త తో కలిసి ఆమె జిమ్ కి వెళుతూ కష్టపడి వర్కౌట్స్ చేస్తున్నా.. మంచు లక్ష్మి లో కాస్త ఆ ముదురుతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎలాగూ మంచు లక్ష్మి బరువు పెరిగినా ఆమె హైట్ అడ్వాంటేజ్. అందుకే, ఆమె బరువు కనిపించదు. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మ తెలుగు సినిమాలకన్నా ఎక్కువగా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ ల పైనే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఓ హిందీ వెబ్ సిరీస్ కోసం కాస్త బోల్డ్ లుక్ లో దర్శనం ఇవ్వబోతుంది. పైగా బెడ్ సీన్స్ లోనూ మంచు లక్ష్మి రెచ్చిపోయిందట.

Also Read:ఇమ్యూనిటీ పెంచుకోండిలా!

- Advertisement -