బిగ్ బాస్ హౌజ్ లో మంచు ల‌క్ష్మీ…

197
manchu lakshmi in bigboss
- Advertisement -

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది బిగ్ బాస్ షో. రోజురోజుకి బిగ్ బాస్ 2పై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఎవ‌రు ఎలిమినెట్ అవుతారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కులు. మొద‌ట్లో నాని చెప్పిన‌ట్టుగా బిగ్ బాస్ హౌజ్ లో ఏదైనా జ‌ర‌గొచ్చు అన్న‌ట్టుగా ఎలిమినేషన్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఓ వైపు నాని చేస్తున్న హంగామా, మ‌రోవైపు మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌స్తున్న గెస్ట్ ల‌తో బిగ్ బాస్ హౌజ్ సంద‌డిగా మారడంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బోలెడంత వినోదాన్ని ఇస్తుంది.

Lakshmi-Manchu

చివ‌ర‌గా ప్ర‌దిప్ వ‌చ్చి హౌజ్ సంద‌డి చేయ‌గా నేడు మంచు ల‌క్ష్మీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇందుకు త‌గిన ప్రోమోను ఒక‌టి విడుద‌ల చేశారు బిగ్ బాస్ టీం. మంచు ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో పోషించిన వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ఇటివ‌లే విడుద‌లైంది. ఈసినిమా అనుకున్నంతగా ఆడ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ప్ర‌మోష‌న్స్ ను మొద‌లు పెట్టింది మంచు లక్ష్మీ. మ‌రింత ప‌బ్లిసిటి చేసుకోవ‌డం కోసం బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మిగ‌తా హౌజ్ మెంట్స్ తో క‌లసి మంచు ల‌క్ష్మీ స‌ర‌దాగా గ‌డిపింది. నేడు జ‌రిగే ఎలిమినేషన్ రేసులో సామ్రాట్, తేజస్వీలు ఉన్నారు. వీరిద్ద‌రి లో ఎవ‌రో ఒక‌రు నేడు హౌజ్ నుంచి వెళ్లిపోనున్నారు.

- Advertisement -