- Advertisement -
సమంత 2012 లో ఛారిటీ కోసం నిధులు సేకరించడానికి బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్లింది. ఛారిటీ ఫండ్స్ కోసం గర్ల్స్ కాలేజీకి వెళ్లడం కంటే బాయ్స్ కాలేజీకి వెళ్లడమే ఉత్తమమని, అక్కడైతే డబ్బులు బాగా వస్తాయని మంచులక్ష్మి సలహా కూడా ఇచ్చిందట. అయితే తనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని అందుకే లేడీస్ కాలేజీకి వెళ్తున్నానని సామ్ లక్ష్మీతో చెప్పిందట.
తీరా కాలేజీ వెళ్లాక సమంత అక్కడ దాదాపు గంటన్నర సేపు గడిపిందట. ఆ సమయంలో 60 వేల రూపాయలు సేకరించానని సామ్ చెప్పింది. అయితే.. అక్కడ యువతులు తనను హగ్ చేసుకోవడం సామ్ కు ఆశ్చర్యంగా అనిపించిందట. అలా చేయడం కొంత షాక్‌కు కూడా లోనయ్యానని చెప్పింది సామ్. అయితే సినిమాల్లో హీరోలను హగ్ చేసుకునే సన్నివేశాలు ఉండనే ఉంటాయి. అయినా.. సామ్ కు ఆడవాళ్లు కౌగిలించుకుంటే ఎందుకు ఆశ్చర్యం వేసిందోనని అంతా చర్చించుకుంటున్నారు.
- Advertisement -