వైద్యో నారాయణ హరి

179
doctor
- Advertisement -

మనలో చాల మందికి ప్రభుత్వ అసుపత్రిలో వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందవనే భావన ఉంటుంది. అయితే ఈ భావన సరికాదంటున్నాడు మంచిర్యాల జిల్లాకు చెందిన రఫిక్. తాను చావు బ్రతుకుల మద్య కొవిడ్ పాజిటివ్ తో గాంధీ అసుపత్రిలో చేరి 22 రోజుల పాటు కరోనా వైరస్ తో పోరాడి గెలిచి తిరిగి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. ఇన్ని రోజులు తనను కంటికి రెప్పలా కాపాడి, తన ప్రాణాన్ని కాపాడి తనకు ప్రాణ బిక్ష పెట్టిన గాంధీ అసుపత్రి వైద్యులు,సిబ్బంది వైద్య సేవలను మానవీయ కోణంలో చూసిన రఫిక్ ఆ అల్లా దీవెనలతో బ్రతికి ప్రాణాలతో బయట పడ్డప్పటికీ, తనకు ప్రాణ బిక్ష పెట్టింది మాత్రం గాంధీ అసుపత్రి వైద్యులు,సిబ్బందే అంటున్నారు. తాను బ్రతికి ఉన్నంతకాలం గాంధీ అసుపత్రి వైద్యులకు, సిబ్బందికి రుణ పడి ఉంటానని చెప్తున్నాడు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోషామహల్ ఏరియా లో నివాసం ఉంటున్న మహమ్మద్ రఫిక్ మార్కెట్లో చిన్న బట్టల షాప్ నడుపుతుంటాడు మ్యారేజ్ అయింది. పిల్లలు లేరు., ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజ్రుబిస్తున్న నేపథ్యంలో రఫిక్ కూడా కరోనా వైరస్ భారిన పడ్డాడు. ఆగస్టు మాసంలో కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానికంగా మంచిర్యాలలోనే అసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ అసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో రఫిక్ కుటుంబ సభ్యులు,స్నేహితులు హుటాహుటిన రఫిక్ ను మంచిర్యాల నుంచి ఆక్సిజన్ మీద అంబులెన్స్ లో హైదరాబాద్ లోని గాందీ అసుపత్రికి తీసుకొని వచ్చారు.ఆగస్టు 11 న అడ్మిట్, అయ్యాడు. అయితే చావు బ్రతుకుల మద్య గాందీ అసుపత్రిలో చేరిన రఫిక్ ను తన పరిస్థితిని చూసి చాల భయపడ్డాడు. ప్రాణ భయంతో ఉన్న రఫిక్ ను గాందీ అసుపత్రిలో వెంటనే వైద్యులు, సిబ్బంది చికిత్స ప్రారంబించారు.అప్పటికే రోజుకొకరు అసుపత్రిలో కరోనా భారిన పడి, పరిస్థితి విషమించి, ప్రాణాలు కోల్పోతుండగా, రఫి కూడాదేవుడిపై భారం వేసి తనను కాపాడాలని వేడుకున్నాడు. గాంధీ అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, కొవిడ్ అసుపత్రి ఇంచార్జీ డాక్టర్ ప్రబాకర్ రెడ్డి, సిబ్బంది తనకు అవసరమైన చికిత్స అందించమే కాకుండా మరి దగ్గరుండి దైర్యం చెప్పారు.

సుమారు 22 రోజుల పాటు గాందీ అసుపత్రిలో చికిత్స అనంతరం ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడిన రఫి ఈ నెల 2 వ తేదీన క్షేమంగా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. గాందీ అసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, తనకు అందించిన వైద్య సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. రఫి చెప్పిన మాటలు విన్న స్నేహితులు గాంధీ అసుపత్రిలో సామాన్య రోగులకు అందుతున్న వైద్య సేవలకు సలాం అంటూ గాందీ అసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు కు అరుదైన గౌరవం ఇచ్చారు. కరోనా చికిత్స చేస్తున్న డాక్టర్స్ దేవుళ్ల తో సమానం అని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో నిరూపించాడు మంచిర్యాల కు చెందిన రఫీక్. చావు బతుకుల్లో ఉన్న తనను గాంధీ డాక్టర్స్ బ్రతికించి పంపించారు అని తెలిపారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తనను సొంత కుటుంబ సభ్యుని లా చూసుకున్నారు అన్నారు. ఆ అభిమానంతో రఫీ కుటుంబ సభ్యులు,స్నేహితులు అందరూ కలిసి రాజారావు ఫోటో కు పాలాభిషేకం చేశారు. అయితే ప్రస్తుత కొవిడ్ మహమ్మారి జనాన్ని కబలిస్తున్న పరిస్థితులలో మనకు ప్రత్యక్ష దేవుళ్లు కేవలం డాక్టరే లని రషి స్నేహితులు గాందీ అసుపత్రిలో వైద్యుల సేవలు, కొనియాడుతున్నారు. గాంధీ అసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు చిత్రపటానికి రఫి స్నేహితులు ప్రతి ఒక్కరు పాలభిషేకం చేసి వైద్యుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరో సారి గుర్తు చేసుకున్నారు. నిజంగా గాంధీ అసుపత్రిలో కరోనా వ్యాదిన భారిన పడి చికిత్స పొందుతున్న సామాన్య రోగులకు డాక్టర్ లు, సిబ్బందికి హాట్సాఫ్. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు లు నిజంగా వైద్యో నారాయణ హరి అనాల్సిందే.

- Advertisement -