- Advertisement -
నటుడిగా, మా మెంబర్ గా అందరికీ సుపరిచితుడైన కాదంబరి కిరణ్ సినిమాల్లో తనదైన శైలి పాత్రలతో అలరించడమే కాకుండా తనకు చేతనైనంతలో కొందరికి సహాయపడుతూ తన ధాతృత్వాన్ని చాటుతూ ఉంటారు. అయితే.. తాను చేయాలనుకొంటున్న సహాయ కార్యక్రమాలు కొందరికే పరిమితం అవ్వడం ఇష్టం లేని కాదంబరి.. “మనం సైతం” ద్వారా తన సహాయ కార్యక్రమాలను విస్తరించనున్నారు. అందుకోసం ఆయన ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ను తెల౦గాణ రాష్ట్ర ఐటి శాఖామాత్యులు కేటీఆర్ ప్రారంభించగా.. తెల౦గాణ రాష్ట్ర సినిమటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాసయాదవ్ అభినందిస్తూ రిజిష్ట్రేషన్ సర్టిఫికెట్ ను కాదంబరి కిరణ్ కు అందచేసినారు .
వీరి ఆస్సీస్సులతో మరింత ఉత్సాహముగా వివిధ సేవాకార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతాననీ www.manamsaithamkadambarigroup.com ను వీక్షించమనీ కాదంబరి కిరణ్ కోరారు!
- Advertisement -