మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. హిట్ మషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఇందులో ప్రధాన నాయికగా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను కూడా జీ నెట్‌వర్క్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల పాట మ్యూజికల్ ప్రమోషన్స్‌కు మంచి ఊపు తెచ్చి చార్ట్‌బస్టర్‌గా మారింది.
కేథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సహూ గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఇందులో ఒక ఎక్స్‌టెండెడ్ కామియోలో కనిపించబోతున్నారు.
Also Read:దీక్షా దివస్.. హరీష్ భారీ బైక్ ర్యాలీ

