క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం చుట్టూ జరుగుతున్న వివాదం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ నేపధ్యంలో కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది తమ వివాహం వాయిదాపడటంలో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్‌లో వస్తున్న రూమర్లు, బెదిరింపులు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె తెలిపింది.
వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఉన్న కొందరు కొరియోగ్రాఫర్లతో పలాష్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ వాయిదా తరువాత పలాష్ నందికా లేదా మరో కొరియోగ్రాఫర్ గుల్నాజ్‌తో సంబంధం పెట్టుకున్నారని అబద్ధపు కథలు వెలువడ్డాయి.
శుక్రవారం, నందికా ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద వివరణాత్మక నోట్ పంచుకుని, ఈ ఆరోపణల్లో తనకు ఏ మాత్రం ప్రమేయం లేదని చెప్పింది.తాను అసలు ఈ జంట వ్యక్తిగత జీవితంలో భాగం కాదని స్పష్టం చేసింది.సోషల్ మీడియాలో తన పేరుతో అబద్ధపు కథలు సృష్టించడం ఎంతో బాధాకరమని తెలిపింది. నిర్ధారణలేని పోస్టులను ఆధారంగా చేసుకుని మీడియా వార్తలు ప్రచురిస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ ఆరోపణలు తన ప్రతిష్ఠను, తనకు దగ్గరున్న వారిని కూడా దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితి తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తెలిపింది.
Also Read:దీక్షా దివస్.. హరీష్ భారీ బైక్ ర్యాలీ
నందికా తనకు ఆన్లైన్‌లో బెదిరింపులు వస్తున్నాయని, అందుకే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రైవేట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. దయచేసి రూమర్లు పుట్టించకండి. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నా పేరును ఇందులోకి లాగొద్దు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. గుల్నాజ్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.


