తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితలను కించపరుస్తూ ఓ వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ . అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు అతను పెట్టిన పోస్ట్ చూసి అసభ్యకరంగా ఉందంటూ ఆ వ్యక్తి అరెస్ట్ చేశారు.
ఫేస్ బుక్ సంస్ధ ద్వారా ఆ వ్యక్తి వివరాలను తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టైన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. అతను మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందిన వాడిగా గుర్తించారు. ప్రజా ప్రతినిధులపై ఇలా అసభ్యకరంగా పోస్టులు పెడితే బాధితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు అరెస్ట్ చేస్తమాని తెలిపారు పోలీసులు.