రాష్ట్రంలో వీకెండ్ లాక్‌డౌన్‌ పరిశీలిస్తాం: సీఎస్ సోమేశ్‌

40
somesh

హైకోర్టు సూచ‌నల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని, ఆ మేర‌కు వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. లాక్ డౌన్ కంటే చికిత్స అందించడం ముఖ్యమన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఉండ‌ద‌ని…ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.

రాష్‌ర్టంలో క‌రోనా ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని….త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌న్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుందన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్ కార‌ణంగానే రాష్ర్టానికి టెస్టింగ్ కిట్లు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కంటే మంచి చికిత్సను అందించ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు.