తన బాధ కంటే ప్రజల బాధే తనకు ఎక్కువ అన్నారు తృణమూల్ చీఫ్,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గాయపడిన తర్వాత ఆదివారం నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మమతా..పురూలియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ ఘటనలో గాయపడ్డాను… నిజానికి అదృష్టవశాత్తూ జీవించి ఉన్నాను. నా కాలికి పట్టీ ఉంది. నేను నడవలేను. ఈ విరిగిన కాలితో నేను అడుగు కూడా బయటపెట్టలేనని కొందరు అనుకున్నారు అని ఆరోపించారు మమతా. బీజేపీ అబద్ధాలు చెప్పి ఎంపీ స్ధానాలను గెలిచింది… వాళ్లు అన్నీ అమ్ముతున్నారు… మేము అభివృద్ధి చేస్తుంటే బీజేపీ మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేస్తోంది అని మమత విమర్శించారు.
నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన తర్వాత జరిగిన ఘటనలో ఆమె గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం కోల్‌కతా నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించి పురూలియా ర్యాలీకి చేరుకుని ప్రసంగించారు మమతా.