నందిగ్రామ్‌లో దీదీ క్లీన్ బౌల్డ్: మోదీ

78
modi

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దీదీ ఓ దీదీ …. నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యార‌ని అన్నారు. ఆమె బౌల్డ‌వ‌డంతో మొత్తం టీమ్‌ను ఫీల్డ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల్సిందిగా అడిగార‌ని ఎద్దేవా చేశారు మోదీ.

ఇప్ప‌టికే తొలి నాలుగు విడ‌త‌ల ఎన్నిక‌ల్లో బెంగాల్ ప్ర‌జ‌లు ఎన్నో బౌండ‌రీలు బాదార‌ని, బీజేపీ సెంచ‌రీ పూర్తి చేసేసింద‌ని అన్నారు. స‌గం మ్యాచ్‌లోనే తృణ‌మూల్‌ను లేకుండా చేసేశామని…..కేంద్ర బ‌ల‌గాల‌పైకి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి పంపించే ప్ర‌య‌త్నం మ‌మ‌తా బెన‌ర్జీ చేశార‌ని మోదీ ఆరోపించారు. ఈసారి మ‌మ‌తా ఓడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ అధికారంలోకి ఎన్న‌టికీ రాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.