Mamatha Banerjee: నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన మమతా

49
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న 9వ నీతి అయోగ్ సమావేశానికి ఇండియా కూటమి నుండి ఏకైక సీఎంగా హాజరయ్యారు మమతా బెనర్జీ. అయితే సమావేశం మధ్యలోనే నుండే ఆమె బయటకు వచ్చారు. సమావేశంలో మాట్లాడానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సమయం ఇచ్చి తనకు మాత్రం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు.

విపక్ష పార్టీ కూటమి తరపున తాను ఒక్కదానినే హాజరయ్యానని. కానీ తాను మాట్లాడుతుండగానే మైక్‌ను ఆపేశారని ఆరోపించారు. ఎందుకు ఆపారు, ఎందుకు వివక్ష చూపుతున్నారు అని చెప్పాను.. మీ పార్టీకి మీ ప్రభుత్వానికి ఎక్కువ స్కోప్ ఉంది, ప్రతిపక్షం నుండి నేను మాత్రమే ఉన్నాను,నన్ను మాట్లాడకుండా ఆపుతున్నారు అని అధికార ఎన్డీయే కూటమి నేతలను ప్రశ్నించారు మమతా. ఇది బెంగాల్‌ను మాత్రమే కాకుండా అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనిన మండిపడ్డారు.

Also Read:TTD:జనతా క్యాంటీన్లపై ఈవో ప్రత్యేక దృష్టి

- Advertisement -