ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీయేతర పక్షాలతో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్న మమత శరద్.. పవార్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో బుధవారం జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, భేటీకి హాజరయ్యే పార్టీల వైఖరి తదితరాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
బుధవారం ఢిల్లీలో పలు పార్టీల ముఖ్య నేతలు,సీఎంలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భేటీకి రావాలంటూ ఆమె ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. దీదీ నిర్వహించే ఈ భేటీలో పాలుపంచుకునే నిమిత్తం శరద్ పవార్ మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నిలిచే అంశంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన శరద్ పవార్‌ను మమతా బెనర్జీ స్వయంగా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.