బీజేపీని గద్దె దించుతాం..మమతా ప్రతిజ్ఞ

5
- Advertisement -

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ‘బ్రోకర్లుగా’ వ్యవహరిస్తున్న వారి పేర్లను తాను ఇప్పటికే నమోదు చేసుకున్నానని, తగిన సమయంలో వారి సంగతి తేలుస్తానని ఆమె హెచ్చరించారు.

బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తుల జాబితాను తాము సిద్ధం చేశామని మమత వెల్లడించారు. బీజేపీ ఏజెంట్లుగా, బ్రోకర్లుగా ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలుసు. వారి పేర్లన్నీ నేను రాసి పెట్టుకున్నాను అని ఆమె పేర్కొన్నారు. కేవలం బెంగాల్‌లోనే కాకుండా, ఢిల్లీ అధికార పీఠం నుండి బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తోందని, కానీ తమ పార్టీ ఇందుకు భయపడదని ఆమె సవాల్ విసిరారు. బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోంది వారి అసలు రంగును ప్రజలకు చూపిస్తాం అని మమత ధ్వజమెత్తారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆమె పునరుద్ఘాటించారు.రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తరుణంలో మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

- Advertisement -