బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నందిగ్రామ్ నియోజకవర్గ అభ్యర్ధి సువేందు అధికారి. ఎన్నికలకు ముందు తృణమూల్ నుండి బీజేపీలో చేరిన సువేందు అధికారి..మమతాపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.
దీదీ వాడుతున్న భాష సరిగా లేదని, ఆమె ఆ భాషను మానుకోవాలన్నారు. మే 2వ తేదీన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతాయని, ఆ తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉండాలని సువేందు తెలిపారు.
మమతా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, ప్రధాని మోదీపై అభ్యంతరకర రీతిలో భాషను వాడుతున్నారని ఈ 66 ఏళ్ల ఆంటీ ఎన్నికల నియమావళిని ఉల్లఘించిందని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉన్నారని, కేంద్ర బలగాలు ఇక్కడే ఉన్నాయని, 14 డ్రోన్లను వాడుతున్నామని, 76 బూతుల్లో క్విక్ రెస్పాన్స్ దళాలు ఉన్నాయని, శాంతియుత వాతావరణం ఉండడం సంతోషంగా ఉందని, ప్రజలే తమ నిర్ణయం తీసుకుంటారని సువేందు తెలిపారు.
మరోవైపు సువేంద్ అధికారి వ్యాఖ్యలపై తృణమూల్ నేతలు మండిపడుతున్నారు. సువేందు నోటిని అదుపులో పెట్టుకోవాలని లేకుంటే తగిన శాస్త్రి తప్పదని హెచ్చరించారు.