కాంగ్రెస్‌పై మోడీ కుట్రను ఎండగడతాం:ఖర్గే

37
- Advertisement -

ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన తమ పార్టీ బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే నిష్పక్ష, పారదర్శక ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రాజ్యాంగ సంస్థలు, ప్రజలు స్పందించాలని పిలుపునిచ్చారు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారం చాలా విచారించదగ్గదన్నారు. అధికారపక్షానికి వేల కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా వచ్చాయని,అధికార పక్షానికి 56 శాతం నిధులు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 11 శాతం మాత్రమే వచ్చాయన్నారు.ప్రింట్, టీవీ, సోషల్ మీడియాలో అధికార పక్షానిదే డామినేషన్ స్పష్టంగా ఉందన్నారు.

14 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కల వివాదంపై మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలు స్తంభింప చేశారు ఇదేం పద్దతి అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు…డబ్బులు లేకపోవడంతో అడ్వర్టైజ్మెంట్స్ బుక్ చేసుకోలేకపోతున్నాం అన్నారు. కాంగ్రెస్‌ను ఆర్ధికంగా కుంగదీసే ప్రయత్నం జరుగుతోందన్నారు సోనియా గాంధీ. కాంగ్రెస్ తీవ్ర మైన ఆర్ధిక సమస్య ఎదుర్కొంటుందని..ఇది కాంగ్రెస్‌పైనే కాదు – ప్రజాస్వామ్యంపైనే అత్యంత ప్రభావం చూపుతుందన్నారు.

Also Read:మరో సర్వే.. టాఫ్ ఫైట్ ఖాయం?

- Advertisement -