Kharge: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ పోరాటం

70
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 19 విపక్ష పార్టీల సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఖర్గే.. బడ్జెట్ పై చర్చ జరపవద్దని బిజెపి సభ్యులు ప్రయత్నం చేశారన్నారు. 50లక్షల కోట్ల బడ్జెట్ 12 నిమిషాల్లో ఆమోదించారు…ఆటంకం సృష్టించాలని విపక్షాలకు లేదన్నారు. కానీ అధికార పార్టీ సభ్యులే సభను గందరగోళ పరిచారని ఆరోపించారు.

నా జీవితంలో అసెంబ్లీ, పార్లమెంట్ లో ఎప్పుడు ఈ రకమైన వ్యవహారాలు చూడలేదన్నారు. మేము లేవనెత్తిన అదాని అంశం విపక్ష పార్టీల ఏకైక డిమాండ్ అన్నారు.ఎల్ఐసి, బ్యాంక్ , ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల డబ్బుతో రూ.12 లక్షల కోట్లకు అదాని ఎగబకాడని ఆరోపించారు. ఒక్క క్యాపిటలిస్ట్ కు అన్ని రంగాలను ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. పోర్టు, ఎయిర్ పోర్టు, మైనింగ్ ఏది వదలకుండా కట్టబెట్టారు…మేము అందుకే జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

జేపీసీ కూర్పు జరిగిన బిజెపి వాళ్లు ఎక్కువ మంది ఉంటారు… అయినా ఎందుకు భయపడుతున్నారని మండిపడ్డారు.జేపీసీ వేస్తే పారదర్శకత వస్తుంది కదా…అదాని అంశం దృష్టి మరల్చేందుకే రాహుల్ గాంధీ క్షమాపణ అంశం తెరపైకి తెచ్చారన్నారు.ఒక్క రైలుని ప్రారభించేందుకు ప్రధానికి ఇంత ఆర్భాటం అవసరమా.? అని ప్రశ్నించారు. ప్రతి రైల్వే స్టేషన్ కు వెళ్లాలా? ..అక్కడ పార్లమెంట్ సభ్యులు లేదా ఇంచార్జ్ మంత్రి ఎవరు లేరా? అని మండిపడ్డారు.

గుజరాత్ అమ్రేలి స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీకి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది…ఎందుకు అనర్హత వేటు వేయలేదన్నారు. కానీ రాహుల్ గాంధీ అంశంలో మాత్రం మెరుపు వేగంతో స్పందిస్తారు…అసలు అనర్హత వేటు పడిన వ్యక్తి సభలోకి వచ్చి ఎలా క్షమాపణ చెప్తాడు… ఏ రకమైన రాజకీయం ఇది అన్నారు. మేము చాలా బలంగా పోరాడుతున్నాం అన్నారు కే కేశవరావు. విపక్షాలను విచ్ఛిన్నం చేయాలనే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.మేము అందరం ఐక్యమత్యంతో ఉన్నాం అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -