- Advertisement -
కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగ విలువలను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ రాజ్యసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రతిపక్షాలు వెల్లడించాయి.
రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు గైర్హాజరవ్వాలని లెఫ్ట్ పార్టీలు, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, డీఎంకే సహా మొత్తం 14 రాజకీయ పార్టీల నిర్ణయించాయి. దీనిని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పిలవాలని పిలుపునిచ్చారు మల్లికార్జున ఖర్గే.
- Advertisement -