గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన టీఆర్ఎస్ వి నేత

195
sravan

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్ కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోంటున్నారు. తాజాగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ కు చెందిన టీఆర్ఎస్ వీ లీడర్ శ్రవణ్ ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పోరేటర్ దేవెందర్ రెడ్డితో పాటు పలువురు విద్యార్దులు పాల్గోన్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన హరిత హారం కార్యక్రమం అద్బుతం అన్నారు. అలాగే సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ధాపించిన ఎంపీ సంతోష్ కు కృతజ్నతలు తెలిపారు.