ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసిన ప్రశాంత్ తండ్రి

203
Mla

కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్ లో నివసిస్తున్న ప్రశాంత్ అనే యువకుడు పాకిస్ధాన్ లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అయితే తాజగా ప్రశాంత్ తండ్రి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిశారు. అనంతరం మంత్రి కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించారు. ఎలాగైనా మీ అబ్బాయిని తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ ఫోన్ లో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రశాంత్ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

దీంతో బాబురావు మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలల క్రితమే మా అబ్బాయి ప్రశాంత్ పాకిస్తాన్ లో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందించారని బాబురావు తెలిపారు. అయితే 15 రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పడంతో సంతోషంగా ఉన్నామని.. ఈరోజు ఒక్కసారిగా టీవీల్లో చూడడంతో ఆందోళన చెందామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కేటీఆర్ మా అబ్బాయి తీసుకొస్తారని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.