న్యూయార్క్‌ నగరంలో ప్రేమపక్షులు..

240
Malia Obama and boyfriend get flirty in NYC
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా మరోసారి వార్తల్లో నిలిచింది. న్యూయార్క్ నగరంలో తన ప్రియుడుతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుతున్న మలియా బ్రిటన్‌కు చెందిన రోరి ఫర్కుహర్సన్‌తో ప్రేమలో పడింది. రోరీ తండ్రి లండన్ లోని ఓ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ మేనేజ్ మెంట్ గ్రూప్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.

మలియా ఒబామా వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం ఇది తొలిసారి కాదు. హార్వర్డ్-యేల్ యూనివర్శిటీల మధ్య ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు అప్పట్లో హల్ చల్ చల్ చేశాయి.

గతంలో మలియా బాత్ రూమ్‌లో సిగరెట్ కాల్చుతుండగా.. ఇంకా ఆ పొగను రింగులు రింగులుగా వదిలుతూ తీసిన వీడియోను ఆమె స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి మలియా వార్తల్లో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -