సహజీవనంతో ఆనందంగా ఉన్నాం

187
- Advertisement -

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని, బాలీవుడ్ కి వెళ్లిపోయిన గోవా బ్యూటీ ఇలియానా… ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల ‘మిడ్ డే’ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా తమ ప్రేమాయణంపై పలు విషయాలను వెల్లడించింది. ఆండ్రూ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని… ప్రస్తుతానికి తాము సహజీవనంలో ఉన్నామని, జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నామని చెప్పింది. పెళ్లికి, సహజీవనానికి మధ్య ఉన్న తేడా చాలా చిన్నదే అని తెలిపింది.

Ileana Talk About Her Marriage

ఆమె మాట్లాడుతూ..ఆండ్ర్యూ నీబోన్ ఏ విషయంలో అయినా ప్రైవసీ గా ఉంటేనే ఇష్టపడతాడు. అయితే ఈ సినిమా ఫీల్డ్ లో నేను 11 ఏళ్లుగా అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. ఎన్నో సినిమాల్లో చేసాను. ఒక నటిగా సంతృప్తినిచ్చిన పాత్రలు కూడా చేశాను. అయితే ఒక్కోసారి ఏ తప్పు చేయకున్నా అనవసరంగా చేదు అనుభవాలను ఇక్కడ ఎదుర్కోవాలి. దీంతో నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఆ ఇబ్బందులకు బాధపడవచ్చు అందుకే నా వల్ల ఆండ్ర్యూ నీబోన్ కి అవన్నీ రాకూడదని అనుకుంటాను. అతను కూడా ఏ విషయాన్ని బహిర్గతం చేయడానికి అంతగా ఇష్టపడడు. అదే విధంగా ఆండ్ర్యూ ని కొందరు ఇండియాకి చెందిన వాడు కాదు అంటారు. అలా అనడం సరికాదు. అతనంటే నాకెంతో ఇష్టం అంటూ.. తన కుటుంబాన్ని ఎవరైనా వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పింది ఇలియానా.

Ileana Talk About Her Marriage

ఇక తన పెళ్లి ప్రస్తావన రాగానే ఈ అమ్మడు.. అప్పుడే పెళ్ళెంటి ఈ సహజీవనంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము అంటూ.. పెళ్లికి ఆ రిలేషన్ కి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చింది. మరి అంతగా తన బాయ్ ఫ్రెండ్ ని ఇష్టపడే ఈ భామ పెళ్లి అనే దగ్గరి బంధాన్ని ఎందుకు దూరంగా పెడుతుందో అమెకే తెలియాలి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ అలవాటుపడిపోయింది. కాకపోతే హిట్లే లేవు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తోంది.

- Advertisement -