అఖిల్‌ మూవీపై నాగ్‌ నిర్ణయం..

213
- Advertisement -

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో’ మూవీపై భారీ అంచనాలున్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. ‘హలో’ మూవీలో అఖిల్ ను ప్రమోట్ చేయడానికి నాగార్జున పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. సినిమాకు చెందిన ప్రతిదీ ఆయన డైరెక్షన్ లోనే జరిగింది.
Nagarjuna Talking about his Son Akhil
కథ ఎంపిక నుంచి నటీనటుల ఎంపిక.. అంతా ఆయనే చూసుకున్నారు. దీంతో ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్రబృందం, అక్కినేని కుటుంబం భావించింది. కానీ హలో సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోవడం వల్లో మరే కారణం వల్లో నాగ్ తాజాగా ఓ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే అఖిల్ తదుపరి చిత్రం విషయంలో తాను ఇన్వాల్వ్ అవబోనని గట్టి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -