ప్రభాస్ హీరో అనగానే ఓకే చెప్పేశా-లాల్

175
prabhas And lal

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్వకత్వంలో సాహో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరికెక్కిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ దుబాయి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో ఒక్క ఫైట్ సీన్ కే రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మలయాళ నటుడు లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

prabhas And lal

తాజాగా ఆయన మాట్లాడుతూ.. సాహో సినిమా కోసం నన్ను సంప్రదించారు. కథ ఏంటి అని కూడా అడగలేదు, కనీసం నా పాత్ర ఏంటి అని కూడా అడగలేదు అని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ప్రభాస్ అని తెలియగానే ఓకే చెప్పాను. ప్రభాస్ అంటే అభిమానం, నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు. తాను దుబాయ్ షెడ్యూల్ లో పాల్గొన్నాని తెలియజేశారు.

ఇక ఈ సినిమా కథ విషయంలో .. దర్శకుడు తీసుకునే జాగ్రత్తలు చూసి ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. చిత్ర యూనిట్ కు కూడా పూర్తి కథ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు . అందుకే ఆ సినిమాలో నా పాత్ర గురించి కూడా చెప్పలేక పోతున్నాన్ని అంటూ ప్రభాస్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.