జూన్ 2న వస్తున్న ‘డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి’..

244
Doctor Satyamurthy
- Advertisement -

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం `ఒరు ముగ తిరై`. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో `డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. సినిమా జూన్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ..

Doctor Satyamurthy Movie

“సోష‌ల్‌మీడియా ఆధారంగా వాట్స్ అప్‌, ఫేస్‌బుక్ ఐడిల్స్‌ని వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్య‌డం వంటివి మ‌నం ఎక్కువ‌గా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని క‌థ న‌డుస్తుంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం. ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చిత్రం మొత్తం ప్ర‌స్తుతం ట్రెండ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. టెక్నికల్ కారణాల వల్ల‌ ఒకరోజు లేటుగా జూన్ 2 న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.

Doctor Satyamurthy Movie

సాంకేతిక నిపుణులుః కెమెరామెన్: శ‌ర‌వ‌ణ పాండియ‌న్‌, మ్యూజిక్‌: ప‌్రేమ్ కుమార్‌, ఎడిటింగ్‌: ఎస్‌.పి.అహ్మ‌ద్‌, ఆర్ట్‌: వినోద్ ర‌వీంద్ర‌న్‌, స్టంట్స్‌: బిల్లా, జ‌గ‌న్‌, పాట‌లు: డాక్ట‌ర్ చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి.

 

- Advertisement -