1. మలబద్దకాన్ని తగ్గించడంలో తేనె శక్తి వంతంగా పని చేస్తుంది. తేనె తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. అది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజుకు మూడు సార్లు నీటిలో తేనె కలుపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.
2. మలబద్దకానికి ముఖ్య కారణం శరీరం లో సరిపోయేంత నీరు లేకపోవడం.ప్రతి గంటకు ,భోజనం అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగాలి,
3. నారింజ పండు మలబద్దకాన్ని నివారించడం లో మంచి ఔషధంగా పని చేస్తుంది. నారింజ పండులో విటమిన్ “C” , అధికంగా పైబర్ లను కలిగి ఉంటుంది. రోజు 2 నారింజ పండ్ల ను ఉదయం ,సాయంత్రం తినడం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు
4. ఎండిన ద్రాక్ష పండు సహజసిద్ధమైనది. మలబద్దకం తగ్గించడం లో సహాయపడుతుంది. ఎండిన ద్రాక్షలో ఫైబర్స్ ఉండటం వలన నీటిని గ్రహిస్తాయి. ఎండిన ద్రాక్ష పండ్లు తినడం వలన మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది.
5.ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం . నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకం నుండి తోందరగా ఉపశమనం పొందవచ్చు.
6. ఆముదం నూనె యాంటీ-ఇన్ ఫ్లమేటరీ , యాంటీ-బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వలన ఇది పేగులలోని పురుగులను తొలగించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
7. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన సాఫీగా జరుగుతుంది
8.రోజు ఉదయం వ్యాయామం చేయడం వలన మలబద్దకం నుండి ఉపశమనం పోందవచ్చు.
ఇవి కూడా చదవండి..