ఆస్ట్రేలియాలో విద్యార్థులకు తెలంగాణ జాగృతి సాయం..

70

కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయ తాండవం దాని వల్ల అనేక దేశాలలో లాక్ డౌన్ తో పాటు సామాజిక దూరం పాటించడం కోసం వివిధ చట్టాలు అమలులో ఉండడంతో పేద మద్యతరగతి ప్రజలు, ప్రవాస భారతీయ విద్యార్థులు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసులకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి నడుంకట్టింది.

jagruthiaustralia

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అండెం మాట్లాడుతూ ప్రవాస భారతీయ, నేపాలీ విద్యార్థులకు అవసరమైన నిత్యావసర సరుకులు మొదటి విడతలో పంపిణీ చేసిన జాగృతి ఆస్ట్రేలియా మరింతమందికి సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, బ్రిస్బేన్ నగరాలలోని భారతీయ విద్యార్థులు ఈ సమయంలో అవసరమైతే 0406969095 (ఆస్ట్రేలియా నెంబర్) కు ఫోన్ చేయాలని సూచించారు. దాంతో పాటు ఐసోలేషన్‌లో ఉన్న వారికి కూడా తమ జాగృతి ఆస్ట్రేలియా సహాయ పడుతుందని తెలిపారు.