శుభవార్త చెబుతానంటున్న ‘మా’ అధ్యక్షుడు..

47

ఇటీవల మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వాగ్ధానాలను నెరవేర్చే దిశగా ఆడుగులు వేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ‘మా’కు సంబంధించి గుడ్ న్యూస్ చెపుతానని కాసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా తెలిపారు. అది ఏంటనేది రేపు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

ఇక మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులందరూ ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన వారంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు ప్యానల్ తో కలిసి తాము పని చేయలేమని వారు స్పష్టం చేశారు. అయితే, వీరి రాజీనామాలను ఆమోదించే అంశంపై విష్ణు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.