మనం సెట్ కాలిపోవడం బాధగా ఉంది..

182
Major fire breaks out at Annapurna Studio
- Advertisement -

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగ్స్ దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంపై కింగ్ నాగార్జున స్పందించారు. మనం సెట్ పూర్తిగా కాలిపోవడం బాధగా ఉందని చెప్పారు.  ‘మనం’ షూటింగ్‌లో భాగంగా నాగేశ్వరరావు ఎక్కువగా ఇక్కడే ఉండేవారని అన్నారు. ఈ సెట్‌తో తమ కుటుంబసభ్యులకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, అందుకే ఈ సెట్‌ను తొలగించకుండా అలానే ఉంచేశామన్నారు. ఇప్పుడు సెట్‌ పూర్తిగా కాలిపోవడం బాధగా ఉందని నాగార్జున అన్నారు.

సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారని అన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. ఈ సినిమా సెట్ కు రూ.2 కోట్లకు పైనే అప్పుడు ఖర్చయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘రాజు గారి గది’తో పాటు పలు సినిమాల షూటింగ్ ఈ సెట్ లోనే జరిగిందని తెలిపారు.

- Advertisement -