రూల్స్ బ్రేక్..ట్రైన్ లో చౌకీ దార్..చాయ్

439
modi
- Advertisement -

చాయ్ వాలాను ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదని కాషాయ నేతలు చెబుతుంటారు. గత ఎన్నికల్లో చాయ్ వాలా ప్రధాని అనే కాన్సెప్ట్‌తో ముందుకువచ్చిన కమలం నేతలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి విజయం సాధించారు. తాజాగా ఈసారి మై భీ చౌకీదార్ అనే నినాదంతో ముందుకుసాగుతున్నారు.

ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు కమలం నేతలు. ఈ నేపథ్యంలో మోడీ పిలుపునిచ్చిన ‘మైభీ చౌకీదార్‌’ నినాదం టీకప్పులపై వెలిసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మైభీ చౌకీదార్‌ పేరుతో ఉన్న కప్పుల్లో ప్రయాణికులకు టీని అందిస్తున్నారు. కాత్‌గోడమ్‌-శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో టీ కప్పులపై మోడీ నినాదాన్ని చూసిన ఓ వ్యక్తి రైల్వే అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ కప్పులను వెంటనే తొలగించారు. కాంట్రాక్టర్‌తో పాటు సూపర్ వైజర్‌ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి దీనిపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మోడీ చౌకీదార్ అంటూ లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ మోడీకి కౌంటర్ వేశారు. దీనికి వెంటనే మోడీ ‘మై భీ చౌకీదార్’ అనే నినాదంతో ముందుకొచ్చారు. బీజేపీ నేతలు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నేతలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.

- Advertisement -