పోలీసుల సేవలు చిరస్మరణీయమన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. హైదరాబాద్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన …ప్రజల భవిష్యత్ కోసం పోలీసులు ప్రాణ త్యాగం చేస్తున్నారని చెప్పారు.
నిరంతర కృషితో లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడుతున్నారు… తెలంగాణ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ బాగుందన్నారు. తెలంగాణ సర్కార్ ప్రజల భద్రతకు పెద్ద పీట వేసిందన్నారు.
15లక్షల సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా అమర్చనున్నామని…400కోట్ల రూపాయలు ఖర్చు తో పోలీస్ కమాండ్ కంట్రోల్ పూర్తి అవుతుందన్నారు. 800 పోలీస్ స్టేషన్ ల సేవలు కమాండ్ కంట్రోల్ లో అనుసంధానం అవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు లేవు అందరూ హ్యాపీ గా ఉన్నారని చెప్పారు. పండుగలు ఉత్సవాలు ఘనంగా కలిసి జరుపుకున్నారు… ఇందులో పోలీసుల సేవలు హర్షనీయం. ఆన్ డ్యూటీలో మరణించిన పోలీస్ హోమ్ గార్డు నుండి కానిస్టేబుల్,ఎస్సై, సీఐలకు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియో అందిస్తున్నామని చెప్పారు.