ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని విజయవంతం చేస్తాం..

37

ఈ నెల 24న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో అందర్నీ భాగస్వామ్యులను చేసి విజయవంతం చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈరోజు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వారికి ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమం వివరాలతో కూడిన పోస్టర్లను వారికి అందజేయడం జరిగింది.