మహేష్ సినిమాలో.. మోర్ వైలెన్స్?

50
- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసిన యానిమల్ మూవీకి సంబంధించిన చర్చే జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ క్రాష్ రష్మిక హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం తో మూవీపై ఉన్న హైప్ డబుల్ అయింది. డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్నాళ్లుగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొదట యానిమల్ స్టోరీని సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించాడని., కానీ వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో మహేష్ బాబు రిజక్ట్ చేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ రూమర్స్ పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుకు కథ చెప్పిన మాట నిజమేనని కానీ మహేష్ బాబు కు చెప్పిన కథ యానిమల్ స్టోరీ కాదని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆ కథలో యానిమల్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుందని దానికి డెవిల్ టైటిల్ అనుకున్నట్లు రీసెంట్ గా చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో తప్పకుండా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశాడు. దీంతో మహేష్ ను మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూసేందుకు అభిమానులు క్యూరియాసిటీతో ఉన్నారు. యానిమల్ తరువాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు సందీప్ రెడ్డి వంగా. మహేష్ బాబు కూడా తన తరువాతి సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు. వీరిద్దరి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్.

Also Read:హరోం హర…పవర్ ఆఫ్ సుబ్రమణ్యం

- Advertisement -