మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ లేనట్లేనా?

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు ssmb29 కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటీసున్న సంగతి తెలిసిందే. ఈ మ్వి కంప్లీట్ కాగానే రాజమౌళి కాంపౌంట్ లో మహేష్ జాయిన్ అవ్వాల్సి వుంది. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడొక క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మహేష్ తదుపరి చిత్రంగా తెరకెక్కాల్సిన ” SSMB 29 ” ప్రాజెక్ట్ ఇప్పుడు అనిల్ రావిపూడి చేతిలో వెళ్ళి నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. .
మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ ” SSMB 30 ” గా మారబోతూందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినప్పటికి ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. ఈ ఏడాది డిసెంబర్ లో మూవీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. కానీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. దాని తరువాత ప్రీ ప్రొడక్షన్ పనులకు మరో 6-7 నెలలు సమయం పట్టే అవకాశం ఉందట. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తుండడంతో ఎక్కడ కంప్రమైజ్ కాకుదని రాజమౌళి భావిస్తున్నారట.

Also Read:NBK:భగవంత్ కేసరి ఇంటెన్స్ జర్నీ

అందుకే కాస్త లేటైన గ్రాండ్ గా స్టార్ట్ చేయాలనేది రాజమౌళి ప్లాన్ గా తెలుస్తోంది. అయితే డిసెంబర్ నాటికి ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న గుంటూరుకారం పూర్తవుతుంది. దీంతో రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి మరింత ఆలస్యం అయితే అనిల్ రావిపూడితో ఓ మూవీ కంప్లీట్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడి భగవత్ కేసరి మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఆ తరువాత మహేష్ బాబుతోనే మూవీ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ఒకవేళ నిజం అయితే రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్లే అనే టాక్ వినిపిస్తోంది.

Also Read:టార్గెట్ 175.. నో బ్రేక్స్?

- Advertisement -